స్వామిని దర్శించుకుంటున్న భక్తులు
ప్రజాశక్తి -నక్కపల్లి:ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఉపమాక వెంకన్న ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు ఆదివారం ఇత్తడి సప్పరం వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక బృందం గొట్టుముక్కల వరప్రసాద్ ఆచార్యులు, సంకర్షణపల్లి రాజగోపాల కృష్ణమాచార్యులు, భాగవతం గోపాల చార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఇత్తడి గరుడ వాహనం లోనూ , గోదాదేవి అమ్మవారిని పల్లకిలోనూ తిరువీధి సేవ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.ఆదివారం మధ్యాహ్నం కర్ణాటక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీరప్పన్ దంపతులు ఉపమాక వెంకటేశ్వర స్వామిని దర్శిం చుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు దేవస్థానం సిబ్బంది స్వాగతం పలికారు.










