ప్రజాశక్తి -నక్కపల్లి:ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవములలో భాగంగా మూడోరోజు ఆదివారం తిరు వీధి సేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, సంకర్షణపల్లి రాజగోపాల కృష్ణమాచార్యులు, భాగవతం గోపాల ఆచార్యులు ఆధ్వర్యంలో ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని హంస వాహనంలోనూ, గోదాదేవి అమ్మవారిని చిన్న పల్లకిలోనూ గ్రామంలో తిరు వీధి సేవ నిర్వహించారు. పలురు భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది నవీన్ మహేష్, టిటిడి విజిలెన్స్ సిబ్బంది ఓఎమ్ సురేష్, గ్రామస్తులు యు.వి శ్రీనివాసరావు, నున్న సుభాష్, సిద్దాబత్తుల కృష్ణ, మీగడ ఈశ్వరరావు పాల్గొన్నారు.










