స్వామి కల్యాణం జరుపుతున్న పండితులు
ప్రజాశక్తి- నక్కపల్లి:ఉపమాక వెంకన్న ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణతో కోదండరాయుడు కల్యాణం రమణీయంగా జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైన వేడుక శనివారం తెల్లవారుజాము వరకు జరిగింది. ఆలయ కల్యాణవేదిక వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, పండితులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, సర్సింహాచార్యులు, సత్యనారాయణాచార్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణం తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణమంతా కిటకిట లాడింది. కల్యాణోత్సవానికి ముందు రథోత్సవం నిర్వహించారు.










