ప్రజాశక్తి-యంత్రాంగం
వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అయిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు.
ఎంవిపి.కాలనీ : వైసిపి కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో నగర మేయర్ హరి వెంకట కుమారి, శాసన మండలి సభ్యురాలు వరుదు కల్యాణి, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు కోలా గురువులు, జాన్‌వెస్లీ, తదితరులు పాల్గొన్నారు.
సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గ వైసిపి కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త కెకె.రాజు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కటుమూరి సతీష్, కంపా హనుక్, అల్లు శంకరరావు, సారిపిల్లి గోవింద్, కె.అనీల్‌కుమార్‌రాజు, సాడి పద్మారెడ్డి, ఆళ్ల లీలావతిశ్రీనివాసరావు, పెద్దిశెట్టి ఉషశ్రీ, కంటి పాము కామేశ్వరి, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసి 45వ వార్డు పరిధి ఎఎస్‌ఆర్ నగర్‌లో పేదలకు కెకె.రాజు, వార్డు కార్పొరేటర్ కంపా హనూక్ చీరలు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో 45వార్డు వైసిపి అధ్యక్షులు పైడి రమణ, మాజీ కార్పొరేటర్ కె.వెంగళరావు, హరిపట్నాయక్, ఆదిలక్ష్మి, నేపాల్ శ్రీను, నాయుడు, సన్నీ, దుర్గా తదితరులు పాల్గొన్నారు.
గోపాలపట్నం : జివిఎంసి 92వ వార్డు పరిధి కుమారి కల్యాణ మండపంలో జివిఎంసి కోఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు ఆధ్వర్యాన కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గునిశెట్టి శ్రీనివాసరావు, గేదెల మురళీకృష్ణ, గొర్ల అప్పలస్వామినాయుడు, తంబిరెడ్డి, కడిమి రామకృష్ణ, మార్కండేయులు, 91, 92 వార్డుల కార్యకర్తలు పాల్గొన్నారు
ఆరిలోవ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా నాలుగేళ్లు పదవీ కాలం పూర్తయిన సందర్భంగా సింహాద్రి అప్పన్న ప్రచార సమైఖ్య వ్యవస్థాపకులు నారాయణస్వామి ఆధ్వర్యంలో దీనదయాల్‌పురంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లను మేయర్ ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ పి.రమణ, అరుకు ఎఎంసి డైరెక్టర్ కె.రామదాసు, వైసిపి నాయకులు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.










