ప్రజాశక్తి-నగరం: మండల కేంద్రం నగరం సెంటర్‌లో వైసిపి ఆవిర్భావ దినం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు హాజరయ్యారు. ముందుగా రాజశేఖర్‌రెడ్డి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో నగరం మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు సచివాలయ కన్వీనర్లు గ్రామ వాలంటీర్లు మరియు గృహ సారథులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు మాట్లాడుతూ అర్హత ప్రామాణికంగా ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య, జడ్పిటిసి నాగమణి, పెద్దపల్లి, గొల్లపాలెం పిఎసిఎస్ అధ్యక్షుడు బెల్లంకొండ వెంకట్రామయ్య, పూడివాడ సర్పంచ్ పాగోలు వెంకటేశ్వరావు, అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
చెరుకుపల్లి: వైసిపి 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చెరుకుపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు మత్తి దివాకర రత్న ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు పైనమ్ ఏడుకొండలురెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పైనమ్ రంగారెడ్డి, జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడు చీరాల ప్రసాద్‌రెడ్డి, ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు, మరివాడ వెంకట ప్రసాద్, కామినేని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రేపల్లె: వైసిపి 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. పార్టీ జెండాలను ఆవిష్కరించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రేపల్లె పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు.వైసీపీ సమర్థవంతంగా పని చేస్తే కార్యకర్తలకు, నాయకులకు గుర్తింపు ఉంటుందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ కట్టామంగా వైసీపీ పట్టణ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి వైసీపీ రూరల్ కన్వీనర్ గాదె వెంకయ్య బాబు, వైపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










