ప్రజాశక్తి -యంత్రాంగం
వైసిపి ఆవిర్భావ దినోత్సవాన్ని విశాఖ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు.
భీమునిపట్నం : స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వేడుకల్లో ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీను ఎగురవేశారు. వైఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఆటంకాలు, అవరోధాలను అధిగమిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో జగన్మోహన్‌రెడ్డి కృషి ఎంతో గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు, పిఎసిఎస్ అధ్యక్షులు అక్కరమాని రామునాయుడు, పార్టీ నాయకులు అల్లిపిల్లి నరసింగరావు, ఎస్ కరుణాకరరెడ్డి, కదిరి ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు.
సీతమ్మధార :ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు ఆధ్వర్యాన పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం పార్టీ నాయకులు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ, వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో జగన్మోహన్‌రెడ్డి వైసిపిని స్థాపించారని తెలిపారు. ముఖ్యమంత్రి అయ్యాక నవరత్న పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అండగా ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి ఫ్లోర్‌లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు కె.అనీల్‌కుమార్‌రాజు, ఆళ్ల లీలావతిశ్రీనివాసరావు, చల్లా రజినిఈశ్వరరావు, వార్డు అధ్యక్షులు నీలి రవి, కెపి.రత్నాకర్, మాజీ కార్పొరేటర్లు పోతు సత్యనారాయణ, నాయకులు కిరణ్ రాజు, ఐహెచ్. ఫరూకి, కెవి.బాబా తదితరులు పాల్గొన్నారు.