Oct 20,2023 21:19

వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్న మంత్రి జయరామ్‌, ఎమ్మెల్యే పెద్దారెడ్డి

        ప్రజాశక్తి-తాడిపత్రి  పట్టణంలోని యల్లనూరు రోడ్డు సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి కాంస్య విగ్రహాన్ని వాల్మీకి(బోయ) కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ సజ్జలదిన్నె రాజు అధ్యక్షతన శుక్రవారం ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరామ్‌ మాట్లాడుతూ వాల్మీకులు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మీ పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు. ఇందుకోసం జగన్‌ ప్రభుత్వం కూడా విశేష కృషి చేస్తోందన్నారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలన్నారు. ముఖ్యంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం కళ్యాణ మండపం కోసం స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని వాల్మీకులు అడగ్గా ఆయన స్పందిస్తూ స్థానిక అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ వాల్మీకులు నా కుటుంబ సభ్యులు అన్నారు. ఎందుకంటే ఎక్కువమంది వాల్మీకులు తమ కుటుంబం పట్ల విశ్వనియత చూపుతారన్నారు. వాల్మీకి మహర్షి కాంస్య విగ్రహ ఏర్పాటు జగనన్న ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.