May 20,2023 19:57

విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న వాల్మీకి నాయకులు

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌
మండలంలోని ఐరన్‌గల్‌ గ్రామంలో శనివారం వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆర్లబండ అంబ భవాని పీఠాధిపతులు మర్రిస్వామి తాత వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపనకు హాజరయ్యారు. ఐరన్‌గల్‌ వాల్మీకి సంఘం కమిటీ నాయకులు తలారి నరసన్న, వెంకటేష్‌, చిన్న వీరేష్‌, సంజీవరెడ్డి, చిన్న గిడ్డయ్య, తమ్మారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి వాల్మీకి మహర్షికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన చేపట్టారు. వాల్మీకి మహర్షి విగ్రహాన్ని వాల్మీకి నాయకులు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అందజేశారు. వాల్మీకి మహర్షి ఆలయానికి టైల్స్‌, స్టీల్‌ గ్రిల్‌ను మాధవరం రాఘవేంద్ర రెడ్డి, రామకష్ణారెడ్డిలు ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ నాయకులు తెలిపారు. వాల్మీకి మహర్షి ఆలయ నిర్మాణానికి కోసిగి వాల్మీకి నాయకులు ముత్తురెడ్డి ఆర్థిక సహాయం అందజేశారని చెప్పారు. వాల్మీకి నాయకులు ఉలిగయ్య, పల్లెపాడు రామిరెడ్డి, నాడిగేని అయ్యన్న, జ్ఞానేశ్‌, వక్రాణి వెంకటేష్‌, చింతలగేని నర్సారెడ్డి, మాదేవా, నరసింహులు, కొండగేని ఈరెడ్డి, పంపాపతి, హోటల్‌ వీరేష్‌, గుడిసె శ్రీరాములు, రంగముని నాయుడు, గుండేష్‌, శివ, శరబంధ స్వామి, విగ్రహ ప్రతిష్టాపనకు హాజరై వాల్మీకి మహర్షికి పూజలు నిర్వహించారు. అనంతరం వాల్మీకి సంఘం నాయకులు మాట్లాడుతూ... వాల్మీకులు పార్టీలకతీతంగా ఐక్యమత్యంగా ఉండి వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్‌ కోసం పోరాటం చేసి సాధించుకోవాలని కోరారు. వాల్మీకులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మంత్రాలయం నియోజకవర్గంలో 80 శాతం వాల్మీకులు ఉన్నారని తెలిపారు. అనంతరం గ్రామ వాల్మీకి కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. వాల్మీకి నాయకులు లసుమయ్య, జనార్ధన్‌, లక్ష్మీకాంత్‌, గోపాల్‌, దేవేంద్ర పాల్గొన్నారు.