Sep 05,2023 23:14
సీనియర్‌ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును సత్కరిస్తున్న టీచర్లు

ప్రజాశక్తి-బల్లికురవ: బల్లికురవలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయుడి స్థాయి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సేవలను పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు. అంకిత భావంతో పని చేసే ఉపాధ్యాయులు ఎందరో సమాజానికి ఆదర్శంగా నిలిచారని, వారి స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పాఠశాల సీనియర్‌ ఉపాధ్యాయులు వై శ్రీనివాసరావును శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్‌ కె హనుమంతరావు, ఉపాధ్యాయులు వెంకట్రావు, సంపతి శ్రీనివాసరావు, బొప్పూడి శ్రీనివాసరావు, గోలి శ్రీను, శ్రీకాంత్‌, నటరాజ, గంగవరపు సునీత, ప్రసాద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.