May 27,2023 22:41

గరగలకు ప్రత్యేక పూజలు చేస్తున్న ఆలయ ట్రస్టీ బ్రహ్మాజీ, ఎసి రామ్మోనరావు

ప్రజాశక్తి - పెద్దాపురం
పెద్దాపురంలో జూన్‌ 18వ తేదీ నుండి ప్రారంభమయ్యే మరిడమ్మ జాతర సందర్భంగా శనివారం మరిడమ్మ తొలి గరగల ఉత్సవం ప్రారంభానికి ముందు జాతర ప్రారంభ సూచికంగా రాటను ఏర్పాటు చేశారు. అనంతరం గరగలకు ప్రత్యేక పూజలు చేసి గరగలు, డప్పుల నృత్యాలతో మరిడమ్మ అమ్మవారి పుట్టిల్లుగా పిలుచుకునే సామర్లకోటలోని చింతపల్లి వారి ఇంటికి వెళ్లారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం నియమిత వీధులలో గరగల ఉత్సవం కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ డాక్టర్‌ చింతపల్లి బ్రహ్మాజీ, ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ సిహెచ్‌ రామ్మోహనరావు, ఆశాధులు, పండితులు, గ్రామస్తులు పాల్గొన్నారు.