ప్రజాశక్తి - పార్వతీపురం : జిల్లాలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐటిడిఎ, గిరిమిత్ర భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్ హాజరై టంగుటూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు. నిస్వార్థంతో దేశ స్వాతంత్య్రానికి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని, వారి చరిత్ర నేటి విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్ : ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 152 వ జయంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీస్ అధికారులతో కలసి ఆంధ్ర కేసరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం పంతులు దేశభక్తిని, త్యాగనిరతిని ప్రజా సంక్షేమ దృష్టిని ఆదర్శంగా తీసుకుని తాము కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌బి సిఐ, సిహెచ్.లక్ష్మణరావు, ఎఆర్ ఆర్‌ఐలు, కుమార్, శ్రీరామ్, డిసిఆర్‌బి ఎస్‌ఐ పాపారావు, డిపిఒ సిబ్బంది పాల్గొన్నారు.
సీతంపేట : స్థానిక ఐటిడిఎలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎపిఒ వై.రోసిరెడ్డి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో డిడి ఎం.శ్రీనివాసరావు, పిఎఒ హరికృష్ణ, అకౌంట్స్ ఆఫీసర్ విజయరాణి, సూపరిండెంట్ దేశ్, డిప్యుటీ ఎస్‌ఒ అప్పారావు, ఎఎంఒ కోటిబాబు, జీసీడీవో రాములమ్మ, సిఎంఒ చిరంజీవులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం : మండలంలోనిటంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నడుకూరు, బొడ్లపాడు, తదితర గ్రామాల్లో జనసేన క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లు ఎం.పుండరీకం, జనసేన జానీ టంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.










