Aug 23,2022 23:41

టంగుటూరి ప్రకాశం చిత్ర పటం వద్ద నివాళి

ప్రజాశక్తి-యంత్రాంగం
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని విశాఖ నగరంలో పలుచోట్ల మంగళవారం ఘనంగా నిర్వహించారు.
గాజువాక: గాజువాకలోని గ్రంథాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి విశాఖ గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్‌సిహెచ్‌ వెంకటరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి బి చంద్రకళ పాల్గొన్నారు.
భీమునిపట్నం : స్థానిక ఆర్డీవో కార్యాలయంలో టంగుటూరి చిత్ర పటానికి ఆర్డీవో ఎస్‌ భాస్కర రెడ్డి, ఎండిఒ కార్యాలయంలో ఎంపిడిఒ పి.వెంకట రమణ తదితరులు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ : టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర టంగుటూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. జివిఎంసి గాంధీ పార్కులో ఉన్న టంగుటూరి విగ్రహానికి నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు రమణి, వర్మ, వై.శ్రీనివాసరావు, చీఫ్‌ సిటీ ప్లానర్‌ సురేష్‌, కార్యదర్శి నల్లనయ్య, నాలుగో జోన్‌ కమిషనర్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.