
ఉండి:టిడిపి సీని యర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు జుత్తిగ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు టిడిపి కార్యాలయంలో అభిమానులు, నాయ కులు, కార్యకర్తల మధ్య మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్‌ఎ మంతెన రామరాజు మాట్లాడుతూ సుదీర్ఘకాలం పార్టీ మండల అధ్యక్షునిగా పనిచేసిన జుత్తిగ శ్రీనివాస్ సేవలు ఎనలేనివన్నారు. పార్టీ అధికారంలో లేనప్పటికీ మండలంలో పార్టీ ఉనికిని చాటి చెప్పారన్నారు. క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తున్న జుత్తిగ శ్రీనివాస్‌కు పార్టీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, ఆకివీడు మండల అధ్యక్షులు మోటుపల్లి రాంప్రసాద్, పాలకోడేరు మండల అధ్యక్షులు దెందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు, నాయకులు గొంట్ల గణపతి, కన్నెగంటి రూత్ కళ పాల్గొన్నారు.