ఎన్‌టిఆర్ చిత్ర పటానికి పూలమాల వేస్తున్న టిడిపి నాయకులు
ఘనంగా టిడిపి ఆవిర్బావ దినోత్సవం
ప్రజాశక్తి - పగిడ్యాల
పగిడ్యాల మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు. ఈ సందర్బంగా మండల కన్వినర్ పలుచాని మహేశ్వరరెడ్డి మాట్లాడారు. ప్రజలే దేవుళ్లు, సమజామే దేవాలయం అనే నినాదం, బిసి, ఎస్సీ, ఎస్‌టి వర్గాల అభివృద్ధే ధేయయంగా టిడిపిని ఏర్పాటు చేసిన 9 నెలలకే అధికారం చేపట్టిన ఘనత పార్టిదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పగడం శేఖర్, నరసింహారెడ్డి, ధర్మారెడ్డి, పాలమర్రి నాగరాజు పాల్గొన్నారు.










