Nov 07,2023 21:16

పెద్ద చెరువులో నిర్వహిస్తున్న తెప్పోత్సవం

ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌ : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం పెద్ద చెరువులో ఘనంగా జరిగింది. వేద పండితులు, ఆలయ పూజారి వెంకటరావు ఆధ్వర్యంలో వనం గుడి నుంచి అమ్మవారిని సున్నపు వీధి గుండా పెద్ద చెరువు వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని విద్యుత్‌ వెలుగులతో నిండిన తెప్పలో ఉంచి మూడు సార్లు అమ్మవారిని తూర్పుకు, పడమరకు చెరువులో ఊరేగించారు. ప్రజలంతా పెద్ద చెరువు గట్టు నుంచి తెప్పోత్సవాన్ని వీక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ శ్రావణి, ఆర్‌డిఒ సూర్యకళ, పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఎసి సుధారాణి, ఆలయ ఉద్యోగులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.