
ప్రజాశక్తి - కాళ్ల
మండలంలోని కోమటిగుంటలో దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. పూలు, పండ్లతోను, విద్యుత్ కాంతులతో అలంకరించిన హంస వాహనంలో అమ్మవారికి కనులు విందుగా తెప్పోత్సవం నిర్వహించారు. మేళ తాళాలు బాణసంచా కాల్పుల మధ్య అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు యలమంచిలి వెంకటరమణ, యలమంచిలి రామాంజనేయులు, ఆలయ కమిటీ సభ్యులు గుర్రం వెంకట సత్యనారాయణ, పులమంతుల ఏసురాజు, మంతెన నాగఆంజనేయులు, యలమంచిలి బాబ్జి, కాపుశెట్టి సత్యనారాయణ, యలమంచిలి గణపతి పాల్గొన్నారు.