
ప్రజాశక్తి - వీరవాసరం
తెలుగు భాషా దినోత్సవాన్ని, గుడుగు రామ్మూర్తి జయంతిని వీరవాసరం ఎంఆర్‌కె జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు జుత్తిగ శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా జుత్తిగ శ్రీనివాస్ మట్లాడుతూ తెలుగు లేనిదే మన జీవితంలో వెలుగు నిండదన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షులు గుండా రామకృష్ణ, దంత వైద్యులు కల్యాణి, తెలుగు ఉపాధ్యాయులు పంపన సాయిబాబు, ఆనందరావు, మన్నె వెంకటేశ్వరావు, బొల్లా విజయలక్ష్మి పాల్గొన్నారు.