
ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్ : మాతృభాష తెలుగును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ ఏ. హరి పేర్కొన్నారు. మంగళవారం పట్టణ సమీపంలోని సాయి గురుకుల ప్రాథమిక పాఠశాలలో సాహితీ స్రవంతి పుట్టపర్తి కన్వీనర్ రమేష్ అధ్యక్షతన గిడుగు రామ్మూర్తి 160 వ జయంతి సందర్భంగా తెలుగు భాష రక్షణ - మన బాధ్యత అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ తెలుగు మాట్లాడేటప్పుడు ఆంగ్ల పదాలు ఎక్కువగా చేర్చి మాట్లాడుతున్నారన్నారు. అందుకు కారణం నేటి విద్యా విధానమే అని అన్నారు. బ్రతుకు కోసం ఏ భాష అయినా మాట్లాడవచ్చని కానీ మాగృభాష మరిచిపోయే అంతగా ఉండరాదని అన్నారు. ప్రధాన వక్త వేణుగోపాల చార్యులు మాట్లాడుతూ తెలుగు భాషలోనే విద్యాబోధన నేటి తరానికి అవసరమన్నారు. అంబేద్కర్ సైతం మాతభాషలోనే పిల్లలకు మనోవికాసం కలుగుతుందని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సుందర్, ప్రధానోపాధ్యాయులు సరళ తదితరులు పాల్గొన్నారు.
కదిరి : మాతృభాష తెలుగును మరవద్దని బ్లూ మూన్ విద్యాసంస్థల చైర్మన్ శివ శంకర్, డిఎస్‌పిశ్రీలత అన్నారు.కదిరి రూరల్ ఎర్రదొడ్డి వద్ద గల బ్లూ మూన్ స్కూల్‌లో విద్యా సంస్థల చైర్మన్ శివశంకర్ ఆధ్వర్యంలో తెలుగు భాష క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు డీఎస్పీ శ్రీలత, సిఐ తమ్మిశెట్టి మధు, ఎస్జీఎఫ్ జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ అంజన్న మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విద్యతోపాటు క్రీడలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు చేసిన కరాటే విన్యాసాలు డాన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం మాధవరెడ్డి సురేందర్ రెడ్డి, జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ :కనుమరుగవుతున్న మన తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బషీర్ అహ్మద్ పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గిడుగు రామ్మూర్తి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చరిత్రధ్యాపకులు మూర్తి, ఎన్ ఎస్ ఎస్ పి ఓస్ శంకర్ నాయక్, ఉమా శంకర్, తెలుగు అధ్యాపకులు ఎస్ హఫీజ్, శంకరప్ప, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కొత్తచెరువు కొత్తచెరువు లోనిశ్రీ చైతన్య పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి అనంతపురం జిల్లా ఏజీఎం సుబ్బారెడ్డి విచ్చేశారు ఈ తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవముగా జరుపుకుంటున్నందున ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా కోసం ఆయన ఎంతో సేవ చేశారన్నారు సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా సమకాలీన శిష్ట వ్యవహారితములో సాంప్రదాయక పండితులతో ఉద్యమం చేసి ఆధునిక భాషను ప్రతిష్టించడానికి మార్గదర్శకుడు అయ్యారనిు అన్నారు అందరికీ తెలుగు భాష అర్థమయ్యే విధంగా తీర్చిదిద్దారన్నారు. దేశంలోనే తెలుగు భాషకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు ప్రతి ఒక్కరూ తెలుగు భాష పై మక్కువ పెంచుకోవాలని సూచించారు అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కతి కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ట్రైను, హనుమంతు ఏవో కేశవరెడ్డి, నాగరాజు తెలుగు అధ్యాపకులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పుట్టపర్తి రూరల్: పండితులకు మాత్రమే పరిమితమైన తెలుగు భాషను పామరులకు సైతం చేరువ చేసిన ఘనత గిడుగు రామ్మూర్తి పంతులదని పెడపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పెడపల్లి పాఠశాలలో మంగళవారం క్రీడా, తెలుగు భాష దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తెలుగు భాషకు వేయి సంవత్సరాలు చరిత్ర ఉందని అన్నారు. 1928 నుండి 1964 వరకు ప్రపంచంలో ఎనిమిది ఒలంపిక్స్ హాకీ పోటీలు నిర్వహించగా వాటిలో ఏడింటిని భారత గెలుపొందారన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలు, వ్యాసర పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీడీ సూర్యనారాయణ ,తెలుగు భాష ఉపాధ్యాయులు, సోమశేఖర్, రాజశేఖర్ రెడ్డి, మోహన్, బాలాజీ, వెంకటేశులు, రమామణి, రామమూర్తి, చన్నకష్ణారెడి,గోపాలరావు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : పట్టణంలోని శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో తెలుగు భాషా, క్రీడా దినోత్సవాన్ని ఆ పాఠశాల కరస్పాండెంట్ జె. శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు తల్లి వేషధారణలతో పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి స్థానిక తెలుగు తల్లి సర్కిల్లో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : రూరల్ మండల పరిధిలోని ఎరుకులవాండ్లపల్లి వద్ద ఉన్న హరీష్ పాఠశాలలో మంగళవారం తెలుగుభాష, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఆటలపోటీల్లో ప్రతిభకనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపల్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పెనుకొండ : పట్టణంలో స్థానిక ఇండోర్ స్టేడియంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మేజర్ ద్యాన్ చంద్ జయంతి సందర్భంగా షటిల్ టోర్నీని మంగళవారం నిర్వహించారు. బాలికల విబాగంలో విజేతగా గర్ల్స్ హైస్కూలు, రన్నర్ గా శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు నిలిచారు.అదేవిధంగా బార్సు లో విజేతగా శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు, రన్నర్ గా గ్లోబల్ జెన్ పాఠశాల విద్యార్థులు నిలిచారు. టోర్నీ అనంతరం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కోచ్ సయ్యద్ రిజ్వాన్ బహుమతులను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ : మండల కేంద్రంలోని ఎస్‌డిఆర్ డిగ్రీ కళాశాలలో తెలుగుబాషా దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈసందర్బంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ కళాశాలలోని డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 90శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రకాష్ రెడ్డి, ఇంటర్ ప్రిన్సిపల్ మల్లికార్జున రెడ్డి, సురేష్ అధ్యాపకులు పాల్గొన్నారు.
పుట్టపర్తి రూరల్ : మండల పరిధిలోని జగరాజు పల్లి కస్తూరిబా పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని గ్రీన్ భారత్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుప్రజా విద్యార్థులకు, ప్రకృతి పరిరక్షణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీత రెడ్డివారి శంకర్ నారాయణ మాట్లాడుతూ తెలుగు భాష విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భారత్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెంకటరత్నం, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
పెనుకొండ : పట్టణంలోని స్థానిక శ్రీసత్య సాయి కళాశాలలో మాతృభాషా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆది శేషారెడ్డి, కళాశాల ఏవో కేశవయ్య మాట్లాడుతూ మాతృభాష గొప్పతనాన్ని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సమావేశంలో అధ్యాపకులు అశోక్ రమేష్, మురళీకృష్ణ, సంధ్య, మంజునాథ్, జంషీర్ భాష తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారుల జీవితాలు నేటి విద్యార్థులకు, యువతకు స్ఫూర్తి దాయకమని పాంచజన్య పాఠశాల వ్యవస్థపాక అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు అన్నారు. మంగళవారం పట్టణంలోని పాంచజన్య పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం, జాతీయ క్రీడల దినోత్సవాన్ని ఘనంగా జరుగుకున్నారు. ఈ సందర్బంగా శ్రీ గిడుగు రామ్మూర్తి, ధ్యాన్ చంద్‌ల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నంద కుమార్, హెచ్‌ఎం గాయత్రి, ఎఒ భాస్కర్, సూపరింటెండెంట్ విజయేంద్ర, ఎహెచ్‌ఎంలు శశికళ, షేక్ అబ్దుల్ రజాక్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా బాలయేసు కళాశాలలో ప్రిన్సిపల్ సౌరిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుబాషా దినోత్సవాన్ని నిర్వహించారు. టిడిపి ఆద్వర్యంలో స్థానిక మేళాపురం సర్కిల్ వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, నినాదాలు చేశారు. వేణు విద్యా విద్యా విహార్ పాఠశాలలో వేణు గోపాల్ ఆద్వర్యంలో తెలుగు ఉపాధ్యాయులను సన్మానించారు. అదే విధంగా ప్రభుత్వ కళాశాలల్లో తెలుగుబాషా దినోత్సవాన్ని నిర్వహించారు.