Mar 01,2023 00:22
విలియమ్స్‌ హవె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న దర్జీలు

ప్రజాశక్తి-కర్లపాలెం: మనుషుల అందాన్ని రెట్టింపు చేసే విధంగా దుస్తులు కుట్టేది ఒక దర్జీ అని కర్లపాలెం మండల దర్జీ కమిటీ సభ్యులు షేక్‌ నాన్నా అన్నారు. మంగళవారం కర్లపాలెం గ్రామ కచేరి వద్ద టైలర్స్‌ భవనంలో ఘనంగా టైలర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కుట్టు మిషన్‌ కనిపెట్టిన విలియమ్స్‌ హావే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం వ్యాప్తంగా ఫిబ్రవరి 28వ తేదీన ఈ వేడుకలు నిర్వహిస్తరన్నారు. మనిషి తన సొంత కాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆసరాగా దర్జీ వృత్తి వున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బుజ్జి, గుండు బాబు, షేక్‌ సర్దార్‌, సీనియర్‌ టైలర్స్‌ కనగాల బాబు, పఠాన్‌ సుభాని, మహబూబ్‌ అలీ, రఫీ, అబ్దుల్లా బేగ్‌, షేక్‌ గపూర్‌, ఎంపీటీసీ షేక్‌ ఆసిఫ్‌ అలీ, మాజీ ఎంపీటీసీ షేక్‌ బాజీ తదితరులు పాల్గొన్నారు.