Jun 20,2023 19:23

నివాళులర్పిస్తున్న బ్యాంకు ఉద్యోగులు

ప్రజాశక్తి - ఆదోని
భారతీయ స్టేట్‌ బ్యాంకు స్టాఫ్‌ యూనియన్‌ అమరావతి సర్కిల్‌ నేత వై.తారకనాథ్‌ 19వ వర్థంతి వేడుకలను ఆదోని మెయిన్‌ బ్రాంచిలో రీజనల్‌ సెక్రటరీ కె.రవికుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆర్‌.రాజశేఖర్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రతేడాది మాదిరిగా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఆదోని పట్టణంలోని ఫెయిత్‌ హోమ్‌ అనాథ పిల్లలకు మిక్సర్‌ గ్రైండర్‌, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్టేట్‌ బ్యాంకులో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఆదోని బ్రాంచి చీఫ్‌ మేనేజర్‌ అబ్దుల్‌ రావూఫ్‌, బ్రాంచి లోకల్‌ సెక్రటరీ లక్ష్మీ, సిఎసి బ్రాంచి లోకల్‌ సెక్రటరీ సి.హుస్సేని, యూనియన్‌ సభ్యులు మల్లేష్‌, జయరాం, నాగేంద్ర, రాజేశ్వరి, లక్ష్మి అపర్ణ, సురేంద్ర, జగన్‌, రవి ప్రకాష్‌, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.