Jul 13,2023 22:25

తాడిపర్తి రామమోహనరావు చిత్రపట ఆవిష్కరణ సభలో మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు

ప్రజాశక్తి - గుంటూరు లీగల్‌ : గుంటూరు బార్‌ అసోసియేషన్‌లో దివంగత తాడిపర్తి రామమోహనరావు చిత్రపట ఆవిష్కరణ మహౌత్సవం గురువారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు చిత్రపటాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్‌.బి.జి. పార్థసారథి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సోమయాజులు మాట్లాడుతూ రామమోహనరావు తన వృత్తి నిర్వహణలో నీతి, నిజాయితి, నిబద్ధతో వ్యవహరించారని, ఆవు ఆయన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయని చెప్పారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని యువ న్యాయవాదులూ తమ వృత్తిలో మంచి పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జీలు, సబ్‌ జడ్జీలు, జూనియర్‌ సివిల్‌ జడ్జీలు, ప్రెసిడెంట్‌ కె.వి.కె.సురేష్‌, వైఎస్‌ ప్రెసిడెంట్‌ దాసరి ఉమామహేశ్వరరావు, జనరల్‌ సెక్రటరీ నాగ వంశీకష్ణ, ట్రెజరర్‌ విజయరాజ కుమార్‌, జీబీఏ మాజీ ప్రెసిడెంట్‌ శాంతకుమార్‌, సీనియర్‌ న్యాయవాది వైకే, ఏపీపీలు, గుంటూరు బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గం, రామమోహన్‌రావు కుమారుడు తాడిపర్తి ఉమాకాంత్‌, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ న్యాయవాదులు, గవర్నమెంట్‌ ప్లీడర్‌ పోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రామమోహన్‌రావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.