సర్టిఫికెట్లు అందజేస్తున్న దృశ్యం
సర్టిఫికెట్లు అందజేస్తున్న దృశ్యం
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.
ప్రజాశక్తి-కావలి:కావలి పట్టణం పెన్షనర్స్ భవనంలో మంగళవారం రాత్రి సంయుక్త నత్య కళానిలయం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ వేడుకల్లో కావలి పట్టణంలోని అనేక పాఠశాలల చిన్నారులు పాల్గొని దేశభక్తిని పెంపొందించేలా నత్య ప్రదర్శనలు ఇచ్చి అబ్బురపరిచారు. కార్య క్రమంలో మాజీసైనిక ఉద్యోగులను సంయుక్త నత్య కళానిలయం ద్వారా ఘనంగా సన్మానిం చడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొని నత్య ప్రదర్శనలు చేసిన చిన్నారులకు సర్టిఫికెట్స్, మెమెంటోలు అందజేసి, వారి గురు వులను సన్మానించారు.










