Aug 15,2023 20:15

ప్రజాశక్తి - వీరవాసరం
మండల వ్యాప్తంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ సుందరాజు, ఎంపిడిఒ కార్యాలయం వద్ద వైస్‌ ఎంపిపి అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, పంచాయతీ వద్ద సర్పంచి చికిలే మంగతాయారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. వివిధ పంచాయతీల వద్ద ఆయా గ్రామాల సర్పంచులు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పెనుమంట్ర : మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి సిబ్బంది ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ బి.సురేంద్ర కుమార్‌, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద దండు అశోక్‌ వర్మ, సచివాలయాల వద్ద పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, మార్టేరు సెంటర్లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థలో ఎడిఆర్‌ ఎం.భరతలక్ష్మి జెండాలను ఆవిష్కరించారు.
కాళ్ల :సమాజంలో అందరూ బాగుండాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందని మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు అన్నారు. కాళ్ల పిహెచ్‌సి వద్ద పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తొలుత మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రంగా విగ్రహాలకు నివాళులర్పించి జాతీయ జెండాను ఎగరవేశారు. పిహెచ్‌సి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కొండా రాజేష్‌ కుమార్‌ బాపిరాజు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అలాగే కలవపూడి, పెదఅమిరం, ఏలూరుపాడు జువ్వలపాలెం, దొడ్డనపూడి, కాళ్ల, కోలనపల్లి, పలు గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పెదఅమిరంలో డొక్కు సోమేశ్వరరావు, కలవపూడిలో గేదెల జాన్‌, కోలనపల్లిలో కొనకంచి సూర్యనారాయణమూర్తి జెండాను ఎగురవేశారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైౖర్మన్‌ పాతపాటి వెంకట శ్రీనివాసరాజు, నీలాద్రిరాజు, కార్యనిర్వహణాధికారి మోకా అరుణ్‌ కుమార్‌ కాళ్లకూరు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన వారికి బహుమతులు అందజేశారు. పెదఅమిరంలో డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు జెండాను ఆవిష్కరించారు.
గణపవరం : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ పమ్మి లక్ష్మి జెండాను ఆవిష్కరించారు. ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిపి దండు వెంకట రామరాజు, డిగ్రీ కాలేజీ వద్ద ప్రిన్సిపల్‌ పి.నిర్మలాకుమారి, పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ వి.వెంకటేశ్వరరావు, గణపవరం, సరిపల్లి, పిప్పర, కేశవరం, అప్పన్నపేట, జల్లికాకినాడ మొయ్యేరు, వెంకట్రాజపురం, ముప్పర్తిపాడు, పంచాయతీల వద్ద ఆయా గ్రామ సర్పంచులు జెండాను ఆవిష్కరించారు.
పాలకొల్లు రూరల్‌ : స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిపి చిట్టూరి కనకలక్ష్మి, సగంచెరువు, తిల్లపూడి, వాలమర్రు గ్రామ పంచాయతీల వద్ద సర్పంచులు కడలి నాగమణి, నడపన శ్రీనివాసరావు, గంటా సత్యనారాయణ జెండా ఎగురవేసి దేశ నాయకులు చేసిన సేవలు కొనియాడారు. అనంతరం నాయకుల చిత్రపటాలకు నివాళులర్పించారు. దగ్గులూరులోని మదీనా ఫౌండేషన్‌ తరపున హాజీ షేక్‌ ధరం మదీనా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, నోట్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సాగ సత్యనారాయణ, పెద్దలు పాల్గొన్నారు.
ఆచంట : దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, వారి త్యాగాలు ఎన్నటికీ మరువలేనివని ఎఎంసి ఛైర్‌ పర్సన్‌ చిల్లే లావణ్య అన్నారు. ఎంపిడిఒ, తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద, వివిధ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో, కళాశాలల్లో, పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా చిన్నారుల వేషధారణలు పలువురిని ఆకర్షించాయి. అనంతరం చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్‌కుమార్‌, ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి, సర్పంచులు పాల్గొన్నారు.
పెనుగొండ : మండలంలోని స్కూళ్లు, కాలేజీల్లో అంగన్‌వాడీ సెంటర్లలో, తహశీల్దార్‌ కార్యాలయంలో, ఎండిఒ కార్యాలయంలో జెండా వందనం చేశారు. ఎస్‌వికెపి కళాశాల కరస్పాండెంట్‌ కెఎస్‌.రాజు మాట్లాడుతూ కాలేజీ స్థాపించి 50 సంవత్సరాలైన తరుణంలో ఎంతో పురోగతి సాధించామన్నారు. ఎండిఒ శ్రీనివాస్‌ దొర, తహశీల్దార్‌ గురుమూర్తి రెడ్డి కార్యాలయాల్లో జెండా వందనం నిర్వహించారు.
పోడూరు : గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచుల చేతుల మీదుగా జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ ఆర్‌వి కృష్ణారావు, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి సబ్బితి సుమంగళి, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ రామ్‌ కుమార్‌ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ డి.సుహాసిని, సర్పంచులు శెట్టిబత్తుల సువర్ణరాజు, చుట్టూ గుల్ల పూర్ణిమ, తానేటి బాబూరావు, దొమ్మేటి శ్రీను పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : కోర్టు ఆవరణలో సీనియర్‌ సివిల్‌ జెడ్జి కె.ప్రకాష్‌బాబు ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. తరువాత బార్‌ అసోసియేషన్‌ హాల్లో ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్‌ సెక్రటరీ దాసం సునీల్‌కుమార్‌, స్పోర్ట్స్‌ సెక్రటరీ పిఎన్‌వి.భద్రుడు, కె.ప్రసాద్‌, న్యాయవాదులు పాల్గొన్నారు. జనసేన కార్యాలయంలో వేడుకలను నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ నిర్వహించారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీస్‌ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. అలాగే తాలూకా ఆఫీస్‌ సెంటర్లో మాజీ ఎంఎల్‌ఎ ఈలి నాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వాకర్స్‌ భవన్‌ వద్ద ఎయిర్‌ స్ట్రిప్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అధ్యక్షులు చలం అధ్యక్షతన నిర్వహించారు. తాడేపల్లిగూడెం వైసిపి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
పాలకోడేరు : వీరుల త్యాగాలను మరవకూడదని ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణ రాజు (చంటిరాజు) అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపిపి సత్యనారాయణ రాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉప ఎంపిపిలు ఆదాడ లక్ష్మీతులసి, చోడదాసి నరేష్‌, ఎంపిటిసిలు పాల్గొన్నారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఎంఎల్‌ఎ మంతెన రామరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచారు. కోరుకొల్లులో రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మంతెన యోగీంద్ర కుమార్‌ పాల్గొన్నారు. విస్సాకోడేరు సెయింట్‌ జాన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌ నిర్వహించిన వేడుకల్లో ప్రధానోపాధ్యాయురాలు డిఆర్‌ స్వర్ణలత జెండాను ఆవిష్కరించారు. సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ నిశాంత్‌ దంపతులు విద్యార్థులకు విద్యాసామగ్రి, దుస్తులు అందజేశారు. శృంగవృక్షం వాసవీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి.
ఉండి : ఉండి రూరల్‌ బ్యాంకులో పేరిచర్ల సూర్యనారాయణ రాజు, యండగండి రూరల్‌ బ్యాంకులో డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు, ఉండి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద సన్నిధిరాజు చలపతిరావు, ఉండి మెయిన్‌ సెంటర్లో కాంగ్రెస్‌ స్తూపం వద్ద కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో సోడదాసి గంగయ్య, కొండలరావు, చింత ఆదిశేషు, షేక్‌ భాషా పాల్గొన్నారు.
అత్తిలి : తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ ఎవి.రామాంజనేయులు జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షులు భూపతి రవీంద్రరాజు, ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.
తణుకురూరల్‌ : ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాల (జూనియర్‌) ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కోస్టల్‌ ఆగ్రో ప్రయివేటు లిమిటెడ్‌ తణుకు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిలుకూరి రామకృష్ణారావు పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ చిట్టూరి సత్యఉషారాణి, అధ్యక్షులు కెవి సుబ్బారావు పాల్గొన్నారు. రూట్స్‌ స్కూల్లో పాఠశాల ప్రిన్సిపల్‌ ఎల్‌కె త్రిపాఠి జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ఎన్‌.సుధాకర్‌వర్మ, బి.విద్యాకాంత్‌ పాల్గొన్నారు.
భీమవరం రూరల్‌ : జాతీయ జెండాను ఎగురవేసి పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి, జిల్లా ప్రజలకు ఎస్‌పి యు.రవిప్రకాష్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌పి యు.రవిప్రకాష్‌ ఐపిఎస్‌ జిల్లా పోలీసు క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో, ఎస్‌పి కార్యాలయంలో అడిషనల్‌ ఎస్‌పి. ఎవి.సుబ్బరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మొగల్తూరు : ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొగల్తూరు కు చెందిన తొయ్యేటి శేషమ్మ జ్థాపకార్థం వారి మనుమలు, శిష్టా సోదరులు, 2023లో పదిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందించారు.