Aug 15,2023 16:53

జెండా ఎగరేసి వందనం చేస్తున్న ఎస్సై నాగార్జున, పోలీస్ సిబ్బంది

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ప్రజాశక్తి - పగిడ్యాల

     మండలంలో 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలల్లోని , సచివాలయాలలో, గ్రామ పంచాయతీల పరిధిలో, పోలీస్ స్టేషన్ తహశీల్దార్, ఎంపిడిఓ కార్యాలయం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేశారు. స్వతంత్ర దినోత్సవం గురించి పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పుల్యాల దివ్య, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంగిరెడ్డి గారి రమాదేవి,  ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి, మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి, సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న, ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు.

జాతీయ జెండాలతో చిన్నారులు
జాతీయ జెండాలతో చిన్నారులు