పాడేరు:సిపిఎం కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్శ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య ఈ తరానికి మార్గదర్శి అని కొనియాడారు. రాజకీయ వేత్తలు, రాజకీయాలు ఎలా ఉండాలో నిలువెత్తు నిదర్శనంగా సుందరయ్య నిలుస్తారన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు ఎల్. సుందర్ రావు,దాస్, చిన్నారావు, మాణిక్యం పాల్గొన్నారు.
అరకులోయ రూరల్:అరకువేలి గిరిజన సంఘం కార్యాలయంలో సుందరయ్య చిత్ర పటానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సురేంద్ర మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కీలక పాత్ర పోషించారన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని కమ్యూనిస్టు పోరాట యోధుడుగా దళితులు, రైతులు, వ్యవసాయ కార్మికులు సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించారని చెప్పారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఐద్వా సంఘం అల్లూరి జిల్లా గౌరవ అధ్యక్షురాలు వివి జయ, గిరిజన మహిళ సంఘం నాయకురాలు జి.సన్యాసమ్మ, సిపిఎం మండల నాయకులు కె.మగ్గన్న, గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న, బాలకృష్ణ పాల్గొన్నారు.
హుకుంపేట:మండలంలోని మెరక చింత పంచాయతీ రంగ్సింగ్‌పాడులో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించరు.ఈ సందర్భంగా సిపిఎం, గిరిజన సంఘం మండల కార్యదర్శులు వి లక్ష్మణరావు, టి క్రిష్ణారావులు మాట్లాడారు.ఎం సింహాచలం, వై.చిట్టిబాబు, ఎం.సోమన్న, వి మత్యలింగం, లచ్చన్న, పండన్న పాల్గొన్నారు.
అనంతగిరి:గిరిజన సంఘం కార్యాలయంలో సుందరయ్యకు జెడ్పీటీసీ. గంగరాజు ఘనంగా నివాళి అర్పించారు. టోకురు సర్పంచ్ కిల్లో మోస్య, సిపిఎం మండల కార్యదర్శి సోమెల నాగులు, గిరిజన సంఘం కార్యదర్శి జన్ని సుబ్బారావు, జి.కలవతి, సింహాచలం, చిన్నారావు పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు: మండల కేంద్రంలో గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో వర్దంతి నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి సీపీఎం మండల కార్యదర్శి పి.భీమరాజు కె.శంకరరావు, సర్పంచ్ త్రినాధ్, నర్సయ్య పూలమాలవేసి నివాళులర్పించారు.
రాజవొమ్మంగి : ప్రజా సమస్యల పరిష్కారానికి సుందరయ్య పోరాటస్పూర్తితో ఉద్యమాలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లోతా రామారావు పిలుపునిచ్చారు. మండలంలోని చికిలింత పంచాయతీ మద్దిబందల గ్రామంలో పార్టీ మండల కమిటీ సభ్యులు రామరాజు అధ్యక్షతన కమ్యూనిస్టు గాంధీ, పీడిత ప్రజల విముక్తిదాత పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు, జోహార్లు అర్పించారు. సిపిఎం నేత బలరాం మాట్లాడుతూ, సుందరయ్య ఉద్యమస్పూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యులు జె రాజు,పి పాపారావు, పి సత్యనారాయణ, కె.జగన్నాధం, పి చిన్నారావు, పి రాంబాబు, ఎ సత్తిబాబు పాల్గొన్నారు.
చింతూరు: మండలంలోని ఎర్రంపేట రచ్చబండ సెంటర్ వద్ద పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతిని ఆయన చిత్రపటానికి మండల కార్యదర్శి సిసం సురేష్, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, కుంజ సీతారామయ్య, పల్లపు వెంకట్.తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముట్టుం రాజయ్య అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో సీసం సురేష్, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం సొంత ఆస్తులను పేద ప్రజల కోసం పంచిన మహోన్నత నాయకుడని కొనియాడారు, సుందరయ్య స్ఫూర్తితో పోలవరం ముంపు గ్రామాల సమస్యలు, స్థానికంగా మౌలిక వసతుల కల్పనపై పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల నాయకులు పోడియన్ లక్ష్మణ్, కారం సుబ్బారావు, కారం నాగేష్, లెనిన్, గుర్రం పెడగయ్య, సాయం భారతి, సోడి రెడ్డి, సోడే రాములమ్మ, సోడే రాఘవయ్య పెద్దర్లు పాల్గొన్నారు.
కొయ్యూరు : మండలంలోని. డౌనూరు పంచాయతీ ముళ్ళుమెట్ట శాఖ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సిపిఎం,ఇతర ప్రజాసంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.సిఐటియు నాయకులు వై అప్పలనాయుడు, పి.బొంజన్న, చిట్టన్న, కామేశ్వరరావు, ప్రవీణ్, కృష్ణారావు, సుబ్బలక్ష్మి, కాసులమ్మ పాల్గొన్నారు.
ఎటపాక: బాసవాగు, ఎర్రబోరు గ్రామాలలో పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సభలు జరిగాయి. సుందరయ్య చిత్రపటానికి సిపిఎం ఎటపాక మండల కార్యదర్శి ఐ.వి., సీనియర్ నాయకులు ఇరపా సత్యం పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు ఐ.పద్మ, ఇరపా అజరు, పి.బాలకృష్ణ, పార్టీ మండల కమిటీ సభ్యులు బుద్దుల భద్రయ్య, కారం జయమ్మ, జి.హరనాథ్, పార్టీ నాయకులు సరవయ్య, పనితి వెంకటేశ్వర్లు, సీసం అర్జున్, నూతలపాటి సుధాకర్, తోట శ్రీను, సరియం లక్ష్మి, తోట రమణ, ప.ిప్రవీణ్, చుక్కమ్మ, పి.రవి పాల్గొన్నారు.
కూనవరం :అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా మండలంలోని రేపాక గ్రామంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బాబు బొర్రయ్య అధ్యక్షతన సుందరయ్య చిత్రపటానికి జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, సర్పంచ్ సోడే శంకర్, మడకం బొజ్జి, మడకం జోగయ్య పాల్గొన్నారు.










