చక్ర స్నానంలో పాల్గొన్న దేవస్థానం అధికారులు
ప్రజాశక్తి-అన్నవరం
అన్నవరం సత్యనారాయణస్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా 6వ రోజైన శుక్రవారం శ్రీచక్రస్నానం, వసంత ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పంపా తీరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వమించారు. అనంతరం దేవస్థానం ఇఒ చంద్రశేఖర్ ఆజాద్, సహాయ కమిషనర్ రమేష్‌బాబు, పాలకమండలి సభ్యులు పేరూరి బదరీ నారాయణలతో పాటు అర్చకులు, పురోహితులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నూతన వస్త్రాలను ధరింప చేసి వసంతోదకాన్ని స్వామి, అమ్మవార్ల పైన, భక్తులపైన చల్లి ప్రసాదం వితరణ చేశారు. సాయంత్రం వసంతోత్సవాన్ని నిర్వహించారు. ముత్తైదువులకు దంపతి తాంబూలాలు అందజేశారు. తదుపరి స్వామి,అమ్మవార్లతో కలిసి అర్చకులు, పురోహితులు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు ఒకరిపైఒకరు రంగులు జల్లుకుంటూ వసంతోత్సవం నిర్వహించారు.










