Jul 02,2023 20:33

నివాళులర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
సిపిఐ సీనియర్‌ నాయకులు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు యు.శ్రీరాములు 3వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఆదివారం సిపిఐ కార్యాలయంలో సిపిఐ సీనియర్‌ నాయకులు హుస్సేన్‌ ఆధ్వర్యంలో శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.అజరు బాబు, జిల్లా సమితి సభ్యులు టి.వీరేష్‌ మాట్లాడారు. మరాఠిగేరి ప్రాంతంలో సిపిఐ శాఖ ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేశారన్నారు. మరాఠిగేరి, వడ్డే గేరి, బోయగేరి ప్రాంతాలలో నివాసాలు ఉంటున్న భవన నిర్మాణ కార్మికులకు, పేదలకు ఇంటి స్థలాలపై భూ పోరాటం చేశారని కొనియాడారు. ఎఐటియుసి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వైటి.భీమేష్‌, బి.ఎంకన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వడ్డే రాము, యు.లక్ష్మీనారాయణ, సిపిఐ పట్టణ, మండల కార్యదర్శులు ఎస్‌.సుదర్శన్‌, కల్లుబావి రాజు, ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌, సిపిఐ నాయకులు కుమారస్వామి, యువరాజు, నాగరాజు, రవి పాల్గొన్నారు.