Nov 13,2023 22:06

డ్యాన్స్‌ చేస్తున్న చిన్నారులు


ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. శ్రీరామ్‌ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత పదవులలో ఉండటం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. శ్రీరామ్‌ స్కూల్‌ చిల్డ్రన్స్‌ డే వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కత కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం శ్రీరామ్‌ హై స్కూల్‌ చిల్డ్రన్స్‌ డే వేడుకలు కోలాహాలంగా సాగాయి. ఈ వేడుకలకు సెంట్రల్‌ నియోజవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివద్ధికి పెద్దపేట వేస్తోందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు అమ్మబడి పథకం, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఎంఎల్‌సి రూహుల్లా, డిప్యూటీ మేయర్‌ అవుతూ శ్రీ శైలజ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామ్‌ పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల అధినేత బోని సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ 17 సంవత్సరాలుగా తమ విద్యార్థులకు చదువుతోపాటు అన్ని రంగాలలో శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు.