ప్రజాశక్తి - పెద్దాపురం రాయభూపాలపట్నంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘ కార్యాలయంలో బుధవారం 70వ జాతీయ సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సహకార సంఘం డైరెక్టర్లు పాము గోవిందు, గంగుమళ్ల నూకరాజు సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామదాసు సహకార శిక్షణా కేంద్రం డిప్యూటీ రిజిస్ట్రార్ వి.కృష్ణకాంత్ సహకార వారోత్సవాల ప్రాధాన్యతను వివరించారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, సబ్ డివిజనల్ అధికారి జెఎన్‌బి.ప్రసాద్ సహకార సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, గ్రామీణులకు అందచేస్తున్న సహాయ సహకారాలు వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సిఇఒ ఎన్‌వివి.సత్యనారాయణ, సిబ్బంది టివి.పాపారావు, కె.రాంబాబు, పివి రమణ పాల్గొన్నారు. స్థానిక డివిజనల్ సహాకార అధికారి వారి కార్యాలయంలో డివిజనల్ సహకార అధికారి కె.పద్మ సహకార జెండాను ఆవిష్కరించారు. డిప్యూటీ రిజిస్ట్రార్ వి.కృష్ణకాంత్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సహకార రంగం పాత్ర,రూ 5 లక్షల కోట్ల డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థలో సహకార రంగం ప్రాముఖ్యత వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ ఎస్.ఏసుబాబు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు జి.చంద్రశేఖర్, జిఎన్‌వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.