Jan 04,2023 00:04

మాట్లాడుతున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ

ప్రజాశక్తి -యంత్రాంగం
అట్టడుగు వర్గాల, మహిళలకు చదువు, సంపద తదితర హక్కుల కల్పనలో ఎంతో కృషి చేసిన సావిత్రీ భాయి పూలే జయంతిని మంగళవారం జిల్లాలో పలు చోట్ల నిర్వహించారు.
భీమునిపట్నం : స్థానిక ప్రభుత్వ డైట్‌లో సావిత్రి భాయి పూలే చిత్రపటానికి ప్రిన్సిపల్‌ యు.మాణిక్యంనాయుడు, అధ్యాపకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ, ఆమె స్ఫూర్తితో బాలికా విద్యను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నాగేశ్వరరావు, జి.రవి, ఎం.మహాలక్ష్మి, సోమయాజులు, షేక్‌ అల్లాఉద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.
చిప్పాడ జెడ్పీ హైస్కూల్‌లో సావిత్రిభాయి పూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్‌.రాజేశ్వరి, ఆర్‌.త్రివేణి, సత్యవతి, అనురాధ, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
మధురవాడ : మధురవాడ శ్రీ విశ్వకర్మ భగవాన్‌ కార్పెంటర్‌ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యాన సావిత్రిబాయి ఫూలే జయంతిని నిర్వహించారు. విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి పార్వతీశం ఆచారి, ఉపాధ్యక్షులు శివప్రసాద్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కురుమోజు గోవిందరావు, శ్రీమంతుల వీరాచారి, మండా రమేష్‌, గోల్‌ సతీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
ఆనందపురం : మండలంలోని వేములవలస ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయిఫూలే జయంతిని నిర్వహించారు. వేములవలస ఉప సర్పంచ్‌ కోరాడ నవీన్‌ జ్ఞానేశ్వర్‌ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సుభాషిని, అంగన్వాడి టీచర్‌ నదియాలను సన్మానించారు.
ములగాడ : స్థానిక సెయింట్‌ ఆన్స్‌ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యాన సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. జాతీయ సేవా పథకం కార్యకర్తలకు, విద్యార్థులకు సావిత్రిబాయి పూలే జీవితంపై క్విజ్‌ను నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రాం అధికారి ఇపిఎస్‌ భాగ్యలక్ష్మి, సీనియర్‌ ప్రోగ్రామ్‌ అధికారి వై.అనసూయాదేవి, ఎన్‌.నదియా, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సిస్టర్‌ ప్రేమ కుమారి, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సిస్టర్‌ జానీస్‌ పాల్గొన్నారు.
శ్రీహరిపురం జీవీఎంసీ హైస్కూల్‌లో రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షులు కోరుకొండ పద్మ ఆధ్వర్యాన జయంతి నిర్వహించారు. మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ, వైసిపి నాయకులు పెదిరెడ్ల నానాజీ ముఖ్య అతిథులుగా హాజరై పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు పాల్గొన్నారు.
విశాఖపట్నం : ఏయూ పరిపాలనా భవనంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి విసి ప్రసాదరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌, ఆచార్య కె.విశ్వేశ్వరరావు, ఆచార్య టి.షారోన్‌రాజు, ఆచార్య సుదర్శనరావు, పితాని ప్రసాద్‌, ఎం.రాంబాబు పాల్గొన్నారు.
గాజువాక : సుందరయ్య కాలనీలోని రవీంద్ర ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్లో సావిత్రీబాయిపూలే జయంతిని నిర్వహించారు. అక్కిరెడ్డిపాలెం ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఎస్‌వికె.పరశురామ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
కంచరపాలెం : బిఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న టైలరింగ్‌ తరగతి సెక్షన్‌లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రామప్రభ, నగర మహిళా నాయకులు బి.పద్మ, మాజీ కార్పొరేటర్‌ బొట్టా ఈశ్వరమ్మ, పెంటకోట రామారావు, టైలరింగ్‌ టీచర్‌ పి సావిత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమాప్రభ మాట్లాడుతూ, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రిగా ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.
ఎంవిపి.కాలనీ : భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని మంగళవారం మద్దిలపాలెంలోని వైసిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల మహిళా అభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో బిసి కమిషన్‌ సభ్యులు పక్కి దివాకర్‌, కార్పొరేషన్‌ చైర్మన్‌ చొక్కాకుల లక్ష్మీ వెంకటరావు, రాష్ట్ర అదనపు కార్యదర్శి రవి రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు సతీష్‌ వర్మ, కొండా రాజీవ్‌ గాంధీ, బిసి విభాగం అధ్యక్షులు కె.రామన్నపాత్రుడు పాల్గొన్నారు.
అనకాపల్లి : స్త్రీ విద్య నిషేధించబడిన 18వ శతాబ్దంలో జ్యోతిరావు పూలే సహకారంతో ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఎనలేని కషి చేశారని మామిడిపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్‌, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్న అబ్బాయి అన్నారు. పాఠశాల ఆవరణలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి వారు పూలమాలవేసి నివాళులర్పించారు. బాలికల కోసం ఆమె ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. కార్య క్రమంలో ఉపాధ్యాయులు రాజు, అనిరోజ్‌, లక్ష్మి, ఉమా, పట్టాభి, సంతోషి, విజయలక్ష్మి, స్వామి, గౌరీ, కామేశ్వరరావు, బాల సరస్వతి, గోపి, సౌజన్య పాల్గొన్నారు.
స్థానిక ఎంపీ డాక్టర్‌ సత్యవతి క్యాంపు కార్యాలయంలో బీసీ సీమాంధ్ర సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి ఎంపీ సత్యవతి పూలమాలవేసి నివాళులు అర్పించారు. స్థానిక ఏఎంఏఎల్‌ కళాశాల సావిత్రిబాయి పూలే విగ్రహానికి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జయ బాబు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. వైస్‌ ప్రిన్సిపల్‌ మహేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ హరిబాబు పాల్గొన్నారు.
కె.కోటపాడు : సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా కె.కోటపాడు ఎంఈఓ కార్యాలయంలో ఆమె చిత్ర పటానికి మండల విద్యాశాఖ అధికారి టి.మధు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయిపూలే ఉపాధ్యాయురాలిగా, రచయితగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
దేవరాపల్లి : దేశంలో స్త్రీల విద్యకు మొట్టమొదటిసారిగా బాటలు వేసిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలేనని ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి అన్నారు. స్థానిక అంబేద్కర్‌ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో మంగళవారం సావిత్రిబాయి పూలే 192వ జయంతి వేడుకలు సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎంపీపీ రాజేశ్వరితో పాటు పలువురు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మోనటరింగ్‌ కమిటీ సభ్యులు కాటపల్లి అప్పారావు, సర్పంచ్‌ సబ్బవరపు పెంటమ్మ, ఎంపీటీసీ మొల్లి కృష్ణమూర్తి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కె.వి.రమణ, పాఠశాల హెచ్‌ఎం సిహెచ్‌ రామారావు పాల్గొన్నారు.
వడ్డాది : వడ్డాది అక్షర స్కూల్‌లో కరెస్పాండెంట్‌ తగరం పూడి వరప్రసాద్‌ సావిత్రి బారు పూలే చిత్ర పటానికి పూల మాల వేసి స్వీట్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 175 సంవత్సరాల క్రితం నిమ్న కుల బాలికల విద్యా గురించి ఆలోచించి పాఠశాలను స్థాపించిన మహిళ సావిత్రిబాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ ప్రిన్సిపల్‌ డి శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.