Oct 10,2023 19:58

కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
వీరశైవ లింగాయత్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వై.రుద్ర గౌడ్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఆయన అభిమానుల మధ్య కేక్‌ కట్‌ చేశారు. డాక్టర్‌ గౌడప్ప గౌడ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ఆయన అభిమానులు రక్తదానం ఇచ్చారు. పుర ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆయనకు పూలమాలలు, శాలువాలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా రుద్ర గౌడ్‌ మాట్లాడారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎమ్మిగనూరు అసెంబ్లీ సీట్‌ కేటాయిస్తే వైసిపి కార్యకర్తలు, శ్రేయోభిలాషుల సహకారంతో పోటీ చేస్తానన్నారు. డాక్టర్‌ నవీన్‌, ఎక్బాల్‌, తెలుగు రాముడు, టీస్టాల్‌ చంద్ర, బడ్డప్ప, కౌన్సిలర్లు ఇస్సాక్‌, శివకుమార్‌, మాజీ కౌన్సిలర్‌ బుట్టా రంగయ్య, వైసిపి నాయకులు పార్లపల్లి చంద్రశేఖర్‌ రెడ్డి, సత్య రెడ్డి పాల్గొన్నారు.