Apr 22,2023 23:20

పెద్దాపురంలో రంజాన్‌ ప్రార్థనలు



ప్రజాశక్తి - పెద్దాపురం
పెద్దాపురం పట్టణంలో శనివారం రంజాన్‌ ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కట్టమూరు పుంత లోని ఈద్గా మెట్టపై కవాడి వీధి జామియా మసీద్‌ ఇమామ్‌ జనాబ్‌ మౌలానా షరీఫుల్‌ రహీం రిజ్వి సాహెబ్‌ ఆధ్వర్యంలో ముస్లింలు ఈద్‌-ఉల్‌-ఫితర్‌ నమాజ్‌ చేశారు. రౌతులపూడి మదీనా మసీ దులో ముస్లింలు రంజాన్‌ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఒకరికి ఒకరు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో షేక్‌ సలీం. ఎండి సల్మాన్‌. షేక్‌ హుస్సేన్‌.షేక్‌ మున్న మండలంలో ఉన్న ముస్లిం పాల్గొన్నారు. పెదపూడి మండలంలో రంజాన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని గొల్లల మామిడాడ, పెద్దాడ, సంపర గ్రామాల్లోని ముస్లింలంతా ఆయా మసీదుల్లో సామూ హికంగా ఈదుల్‌ ఫితర్‌ నమాజ్‌ చేశారు. ఈ సందర్భంగా మశీదు ఇమామ్‌లు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.