
ప్రజాశక్తి - భీమవరం రూరల్
సమాజంలో అక్క, చెల్లెమ్మ అందరూ సంతోషంగా ఉండాలని, కుటుంబంలో మహిళలు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఎంఎల్‌ఎ గ్రంథి శ్రీనివాస్ అన్నారు. మహిళలందరికీ ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ బుధవారం రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళా ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో మహిళల పేరు మీద ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలూ అమలు చేస్తుందన్నారు. మహిళలకు రక్షణగా కట్టుదిట్టమైన చట్టాన్ని తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి అక్క, చెల్లెమ్మనూ ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారన్నారు.
పాలకొల్లు :బ్రహ్మ కుమారీలు డిసిఎంఎస్ మాజీ ఛైర్మన్ యడ్ల తాతాజీకి బుధవారం రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ బోర్డ్ మెంబర్ చెన్ను విజరు, పెచ్చెట్టి కృష్ణాజీ, మాజీ కౌన్సిలర్ రేలంగి శ్రీను పాల్గొన్నారు. అలాగే వైసిపి కార్యాలయం వద్ద వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపికి, టిటిడి సభ్యులు మేకా శేషుబాబుకు బ్రహ్మ కుమారీలు, పలువురు మహిళలు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. గుణ్ణం నాగబాబు కార్యాలయం వద్ద పలువురు వైసిపి మహిళా నేతలు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.