Jun 16,2023 00:45

కేక్‌ను కట్‌ చేయిస్తున్న నేతలు

ప్రజాశక్తి- చీడికాడ:మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్‌ నాయకులు రెడ్డి సత్యనారాయణ 98వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చీడికాడ మండలం పెద గోగాడ గ్రామంలో ఆయన స్వగృహం వద్ద మాడుగుల తెలుగుదేశం సీనియర్‌ నాయకులు పైలా ప్రసాద్‌రావు, మాడుగుల ఇంచార్జ్‌ పివిజి కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడులతో సహా పలువురు నాయకులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పైలా ప్రసాదరావు మాట్లాడుతూ, రాజకీయాల్లో రెడ్డి సత్యనారాయణ ఆదర్శవంతమైన జీవితం గడిపారన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు రెడ్డి రాము, మండల పార్టీ ప్రెసిడెంట్‌, పోతల చిన్నాయుడు, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి సన్యాసినాయుడు, డోకల అప్పలనాయుడు, గొర్లె గణేష్‌, మాజీ ఎంపిపి కుచ్చు కలావతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.