
ప్రజాశక్తి -యంత్రాంగం
భీమునిపట్నం : స్థానిక చిన్న బజారు పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పిసిసి సభ్యులు తెడ్డు రామదాసు ఆధ్వర్యాన పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నిమ్మకాయల పైడిరాజు, సిహెచ్.నరసింహారావు, పాసి శ్రీనివాస్ పాల్గొన్నారు.
గాజువాక : పాతగాజువాక రాజీవ్ కూడలి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గాజువాక సమన్వయ కర్త జెర్రిపోతుల ముత్యాలు ఆధ్వర్యాన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుడివాడ శ్రీను, యరభాల భూలోక, ఆనంద్‌బాబు, శనివాడ హరిబాబు, సియ్యద్రి అప్పారావు, కొత్తపల్లి పెంటయ్య, ఉరుకూటి కుమార్, బైరాగి, షరీఫ్, ఆనంద్ పాల్గొన్నారు.
విశాఖ కలెక్టరేట్ : అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ బిసి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట వాసుదేవరావు పూలమాలలు వేసి ఘన నివాళ్లర్పించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ఆర్.గురునాథరావు, వాసుపల్లి సత్తిబాబు, ఎస్‌రవి, బి.రాజు, ఎల్.కనకరాజు, ఎస్.బాబ్జీ పాల్గొన్నారు.
అనకాపల్లి : భారత్‌లో శాస్త్ర,సాంకేతిక రంగాలను ప్రవేశపెట్టి, విస్తరింపజేసిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కుతుందని అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, న్యాయవాది ఐఆర్.గంగాధర్ అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్‌గాంధీ 32వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్షులమాలలు వేసి నివాళులు అర్పించారు. అనకాపల్లి పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దాసరి సంతోష్ కుమార్, తేబూడి సంతోష్, మళ్ల శివకుమార్, పిల్లి త్రినాథ్ గౌడ్ పాల్గొన్నారు.
కశింకోట : రాజీవ్‌గాంధీ వర్థంతి సందర్భంగా కశింకోట మెయిన్‌రోడ్డులోని ఆయన విగ్రహానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. చిరుప్రాయంలోనే దేశ ఆరవ ప్రధానిగా ఎన్నో పథకాలు, సంస్కరణలతో అభివృద్ధి పథాన నిలిపారన్నారు. భారత దేశాన్ని సాంకేతిక, ఆర్ధిక రంగాలలో అగ్రస్థానంలో నిలపడంతోపాటు 18ఏళ్లకే ఓటుహక్కు జవహర్ నవోదయ విద్యాలయాల స్థాపన, రాజ్యాంగంలోని 73,74 అధికరణం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను స్థాపించి గ్రామీణ, పట్టణ సంస్థలకు నిధులు సమకూచి, స్థానిక సంస్థలు బలోపేతం చేయడం వంటి ఎన్నో చర్యలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కత్తెర శ్రీధర్, న్యాయ విభాగం జిల్లా అధ్యక్షులు సూరా శ్రీనివాస్, అనకాపల్లి అసెంబ్లీ సమన్వయ కమిటీ సభ్యులు కాళ్ళ సత్యనారాయణ, న్యాయవాది ఐఆర్ గంగాధర్, దాసరి సంతోష్, సూరిశెట్టి ఆదిబాబు, మాడెపు నాయుడు, వాయిబోయిన రాజు, జగ్గ అప్పారావు, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బి. బాల మురళీ పాల్గొన్నారు.
పరవాడ: మాజి ప్రధాని రాజీవగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పరవాడ మండల కాంగ్రస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కెవి రామయ్య నాయుడు, రాష్ట్ర ఒబిసి సెల్ కోఆర్డినేటర్ ఆర్‌ఆర్ నాయుడు రాజీగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, కార్యక్రమంలో మాధవి, రాజు, అప్పలనాయుడు పాల్గొన్నారు.
నర్సీపట్నంటౌన్:పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నంగిన రమణ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పీసీసీ సభ్యులు మీసాల సుబ్బన్న రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి సెల్ అధ్యక్షులు రాజన్నరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దా, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లి:నక్కపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడేటి శంకర్ రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బత్తుల రఘు, నీలి అశోక్, గంగిశెట్టి గణేష్, ముద్దా నాగేశ్వరరావు, దేశెట్టి నాగేశ్వరరావు, దేశెట్టి పాము, బర్రెలంకి సత్తిబాబు, చిన్న, దూది నాగేశ్వరరావు పాల్గొన్నారు.