Aug 20,2023 23:49

గాజువాకలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ప్రజాశక్తి -గాజువాక, పెందుర్తి
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని ఆదివారం నగరంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గాజువాక : గాజువాక రాజీవ్‌ కూడలి వద్ద ఉన్న రాజీవ్‌ గాంధీ విగ్రహానికి గాజువాక నియోజవర్గ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త జెర్రిపోతుల ముత్యాలు అధ్యక్షతన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు లక్కరాజు రామారావు, నాయకులు అస్మిత్‌ ఆలీ, యరభాల భూలోక, ఉరుకూటి బాబూరావు, స్వర్ణ, మురళి, అలీ, రమణారావు, శ్రీను, సింహాచలం, అప్పలనాయుడు, కోదండరావు పాల్గొన్నారు.
పెందుర్తి : చినముషిడివాడలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి విన్నకోట రాము పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మీసాల సన్యాసిరావు, కె.రామకృష్ణారావు, ఎం.సంతోష్‌, రెడ్డి నరేష్‌, వెంకటరమణ పాల్గొన్నారు.