May 22,2023 00:15

రాజీవ్‌ గాంధీ వర్థంతి

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌: మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ 32వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆదివాసి చైర్పర్సన్‌ పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ, రాజీవ్‌ గాంధీ చేసిన సేవలను మరవలేమని కొనియాడారు. శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధికి అడుగులు వేసారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కిముడు ఆదినారాయణ, మోహన్‌రావు, నాగేశ్వరరావు, పద్మరాధ లక్ష్మి, గంగాధర్‌ సుబ్బారావు, జగన్నాథం రఘురాం, అద్దు, కాంతిరాజ్‌ పాల్గొన్నారు.