Aug 20,2023 19:54

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతిని స్థానిక కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగ నిర్వహించారు. ఆదివారం స్థానిక పేరంపేట రోడ్డు మీసేవ కేంద్రం వద్ద రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షులు ప్రగడపాటి కాశి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తిశేశులు, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ దేశానికి సాంకేతికతను అందించారని తెలిపారు. మాజీ జెడ్‌పిటిసి సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ దేశ ప్రధానిగా కమ్యూనికేషన్‌ రంగాన్ని అభివృద్ధి చేసి, దేశాన్ని సాంకేతిక రంగంగా ప్రపంచ చిత్రపటంలో అత్యంత ఉన్నత శిఖరానికి తీసుకెళ్లారాన్నరు. ప్రజాస్వామ్య పరిరక్షణే థ్యేయంగా దేశాన్ని పరిపాలించి, భారతదేశాన్ని శాంతి భద్రతలతో ముందుకు నడిపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు హేరా హకీం, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తాడేపల్లి ఉమా, పట్టణ కార్యదర్శి వీరవల్లి సోమేశ్వరరావు, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు మొగిలినీడిశ్యాం పాల్గొన్నారు.