కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న నాయకులు
ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ 54వ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జీ దేవిశెట్టి ప్రకాష్ మాట్లాడారు. ప్రాణ హాని ఉందని తెలిసినా ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,600 కిలోమీటర్ల భారత్ జోడో పాదయాత్ర విజయవంతంగా నిర్వహించారన్నారు. 2024లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఐఎన్‌టియుసి జిల్లా ఉపాధ్యక్షులు ఖలందర్, సీనియర్ నాయకులు శ్రీధర్, మండల అధ్యక్షులు నెట్టేకల్ హనుమంతు, ఉపాధ్యక్షులు కుప్పగల్ అయ్యన్న పాల్గొన్నారు.










