ప్రజాశక్తి-యంత్రాంగం
ఉక్కునగరం : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా స్టీల్‌ప్లాంట్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం, వాల్తేర్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ సంయుక్త నిర్వహణలో రెండు రోజుల ఫొటో ప్రదర్శనను ఉక్కునగరంలో నిర్వహించారు. శనివారం ప్రారంభ కార్యక్రమానికి స్టీల్‌ప్లాంట్ సిఎమ్‌డి అతుల్ భట్ ముఖ్యఅతిథిగా హాజరై ఫొటో ప్రదర్శనలో ఉంచిన చిత్రాలను ఎంతో ఉత్సాహంతో తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిత్రాలు చరిత్రను చిరకాలం భద్ర పరుస్తాయన్నారు. రాబోయే తరాలకు చరిత్రను అందిస్తాయని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణ, ప్రారంభ దశ నాటి చిత్రాలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. చక్కటి ఫొటో ప్రదర్శనను ఏర్పాటుచేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉక్కు చీఫ్ జనరల్ మేనేజర్ జి.గాంధీ, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగాధిపతి ఆర్‌పి.శర్మ, వాల్తేరు ఫొటోగ్రాఫిక్ సొసైటీ అధ్యక్షులు పిఎన్.సేథ్, గౌరవాధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు జగపతిరాజు, కోశాధికారి వివి.రామరాజు, సహాయ కార్యదర్శి రమేష్‌చంద్రబోస్, ప్రతినిధులు సన్యాసిరావు, బిహెచ్.శ్రీనివాస్, డివి.రమణ, ప్రసాద్, బ్రహ్మాజీ, జిఎన్.మూర్తి, ఎం.కనకరాజు, వి.డెంటల్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ రమేష్, డిఎవి స్కూల్ విద్యార్థులు, ఉక్కు ఉద్యోగులు పాల్గొన్నారు.
చోడవరం : అంతర్జాతీయ ఫోటో దినోత్సవం సందర్భంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం చోడవరంలో కేక్ కట్ చేశారు. ప్రపంచ ఫోటో పితామహుడు లూయిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బొంగరాల సురేష్, రాజాన శివకుమార్, కార్యదర్శి స్వామి పట్నాయక్, సహాయ కార్యదర్శి టి సుధా, ట్రెజరర్ ఏ తులసీరావ్, సభ్యులు ప్రభాకర్, సతీష్, దుర్గారావు పాల్గొన్నారు.










