Oct 24,2023 22:13

పజాశక్తి - వీరవాసరం
            కొణితివాడ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చెందిన 1991-92 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు సమ్మేళనాన్ని దసర పండుగను పురష్కరించుకుని నిర్వహించుకున్నారు. కొణితివాడ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ వేదికగా వీరు కలుసుకున్నారు. ఈ సందర్భంగా గత స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటూ హైస్కూల్‌ ప్రాంగణంలో గడిపారు. చివరిగా తమ ఉన్నత స్థితికి కారణమైన గురువులను జయరాజు, కామశాస్త్రి, నరసింహరాజు, శర్మలను సత్కరించారు. తొలుత మృతి చెందిన తమ గురువులైన బాపిరాజు, శ్రీరామరెడ్డి, నాటి మిత్రులు జవ్వాది రామకృష్ణ, నాగరాజు వర్మ, పడవల హరిబాబు, చీతిరేల సుబ్బారావు, తాడాల సుబ్బారావు, పార్శి మోహన్‌రావు, రామకృష్ణలకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ అపూర్వ సమ్మేళనానికి నాగరాజు సుబ్బరాజు, వెలక్కాయల పార్థసారథి, చిక్కాల రవికుమర్‌, కురిశెట్టి శేషు, రామకృష్ణ కృషి చేశారు.