May 21,2023 20:31

గురువులను సన్మానిస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి - గోనెగండ్ల
గోనెగండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1997-98 పదో తరగతి బ్యాచికి చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాలను వీడి 25 ఏళ్లయిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని తమ కుటుంబ వివరాలను ఒకరికొకరు పంచుకొని గతకాలపు బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అలాగే ఆనాడు తమకు చదువులు చెప్పిన గురువులు మాధవస్వామి, వెంకటరమణ, జానకి రాముడుతో పాటు తమకు ట్యూషన్‌లో పాఠాలు బోధించిన ఉపాధ్యాయులైన జెఉస్మాన్‌, రహమతుల్లా, సుబ్రమణ్యం, గిప్సన్‌, వీరన్న, అప్పుడు పాఠశాలలో నాన్‌ టీచింగ్‌ సిబ్బందిగా పని చేసిన కౌలుట్లయ్య, ఖాసీం వలీని శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా 'నేస్తం' అనే ఒక స్వచ్ఛంద సంస్థను రిజిస్టర్‌ చేసుకొని దాని ద్వారా ఇక మీదట సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థులు రవికుమార్‌ నాయుడు, మద్దికెర రంగస్వామి, బండా రమేష్‌, కె.రంగముని, కె.కృష్ణ, ఎం.మునిరంగడు, శివరాం నాయుడు పాల్గొన్నారు.