ఘనంగా ప్రపంచ మహా సముద్ర దినోత్సవం
ప్రజాశక్తి - నంద్యాల
పట్టనంలోని రామకృష్ణ డిగ్రీ, పిజి కళాశాలలో గురువారం ప్రపంచ మహా సముద్ర దినోత్సవం ప్రొఫెసర్ జి. రామకృష్ణ రెడి,్డ కళాశాల డైరెక్టర్ జి. హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి.రామకష్ణ రెడ్డి, సీనియర్ అనస్థీషియా రవికృష్ణ హాజరై మాట్లాడారు. ప్లాస్టిక్, వృధా పదార్థాలు సముద్రంలో ఎక్కువగా వేయటం వలన అవి కలుషితం అవుతున్నాయని అన్నారు. ఫలితంగా అందులో జీవరాశులన్ని మరణిస్తాయని, ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జీవరాశులు కనుమరుగవుతాయని తెలిపారు. సముద్ర జలాలు కాలుష్యరహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వ్యాసరచన, డ్రాయింగ్, ఎలక్యూషన్ వంటి పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. బనగానపల్లె : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని వృక్షశాస్త్ర శాఖ అధ్యక్షురాలు డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సముద్రాలు మనిషి మనుగడకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు కుమారి కుసుమేశ్వరి, కుమారి సౌమ్య ప్రసంగించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ కోటేశ్వరరావు, కౌసల్య దేవి, వహీదా, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










