ఆర్‌కె బీచ్‌లో ప్రజాశక్తి ప్రత్యేక సంచిక ఆవిష్కరిస్తున్న సినీ నటుడు రవి ప్రకాశ్
ప్రజాశక్తి 42వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికలను విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. ప్రజల గొంతు.. ప్రజాశక్తి అని కొనియాడారు.
ప్రజాశక్తి - విశాఖపట్నం : ప్రజాశక్తి వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆర్‌కె.బీచ్‌లో సినీ నటుడు రవిప్రకాష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి బ్రాంచి మేనేజర్ ఎం.వెంకటేశ్వరరావు, రాజేష్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఇదేచోట ఇండియన్ బ్యాంకు ఉద్యోగులు కూడా సంచికను ఆవిష్కరించారు.










