Sep 12,2023 20:06

కేక్‌ కట్‌ చేస్తున్న భీమిరెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
వైసిపి యువ నేత వై.ప్రదీప్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని భీమా నిలయంలో టిటిడి పాలక మండలి సభ్యులు వై.సీతారామిరెడ్డి, మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్‌లో వైసిపి మండల అధ్యక్షులు జి.భీమిరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచి తెల్లబండ్ల భీమయ్య కేక్‌ కట్‌ చేసి, బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు కేక్‌ తినిపించుకొని యువనేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాతవూరులోని శివాలయం వద్ద ఆడిటర్‌ శంకర్‌ స్వామి నేతృత్వంలో శ్రీరామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం చేయించారు. వైసిపి మండల నాయకులు పెట్రోలు బంక్‌ శీను, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్‌ ఎంపిపి పులికుక్క రాఘవేంద్ర, రోగప్ప, బొజ్జప్ప, రవి రెడ్డి, మేకల నారాయణ, చెట్నేహళ్లి సర్పంచి అంజిని, ఉప సర్పంచి హోటల్‌ పరమేష్‌ స్వామి, మాజీ ఉప సర్పంచి గోర్కల్‌ కృష్ణస్వామి, ఎంపిటిసి వెంకటేష్‌ శెట్టి పాల్గొన్నారు. పెద్దకడబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో ప్రదీప్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. గ్రామంలోని ఉర్దూ పాఠశాలలో, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసి, కేక్‌ కట్‌ చేశారు. మాజీ ఎంపిటిసి కెపి.ఎల్లప్ప, హైస్కూల్‌ ఛైర్మన్‌ బొడ్డన్న, మదిరే రాముడు, వలీ బాష, కె.నజీర్‌, కె.బ్రహ్మయ్య, మల్లయ్య, ఉచ్చప్ప, నరసింహ, సునీల్‌ పాల్గొన్నారు.