Aug 17,2023 22:15

ముదిగుబ్బలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

పెనుకొండ : పట్టణంలోని శ్రీసత్యసాయి డిగ్రీ కళాశాలలో పల్లె ఉమా జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పల్లె ఉమా చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఆదిశేష రెడ్డి, కళాశాల ఏవో కేశవయ్య, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ గంగాధర్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ అశోక్‌, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్‌ : బాలాజీ విద్యాసంస్థల మాజీ చైర్మన్‌, మాజీ మంత్రి పల్లెరఘు నాథరెడ్డి సతీమణి పల్లెఉమ 63వ జయంతి వేడుకలను స్థానిక శ్రీనివాస డిగ్రీ, జూనియర్‌ కళాశాలలో ఘనంగా జరుపుకున్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ముసల్‌ రెడ్డి , జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పుష్పవాహనరెడ్డి సమక్షంలో పల్లె ఉమమ చిత్రపటానికిపూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండలంలోని గొట్లూరు అనాధాశ్రమంలో వృద్ధులకు పాలు, బ్రెడ్లు పంపిణీచేశారు.
ముదిగుబ్బ : పల్లె ఉమా జయంతి సందర్భంగా మండల పరిధిలోని జొన్నల కొత్తపల్లి తండా పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు బిస్కెట్లు పంపిణీ చేశారు. అంతేకాకుండా మండల కేంద్రంలోని ఎస్‌ డి ఆర్‌ ఆర్‌ డిగ్రీ కళాశాలలో పల్లె ఉమా చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలేజ్‌ ప్రిన్సిపల్‌ ప్రకాష్‌ రెడ్డి, జొన్నల కొత్తపల్లి తండా హెడ్మాస్టర్‌ సూర్యచంద్రారెడ్డి , జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ మల్లికార్జున్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్‌ : మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సతీమణి పల్లె ఉమా జయంతి వేడుకలను టిడిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి విద్యారంగంలోనూ రాజకీయంగా ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. వృద్ధాశ్రయంలో వృద్ధులకు పాలు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కన్వీనర్‌ రామాంజనేయులు, నాయకులు శ్రీరామ్‌ రెడ్డి, సామకోటి ఆదినారాయణ, కోనంకి గంగాధర్‌ నాయుడు, మాల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం :పల్లె ఉమా జయంతిని సప్తగిరి ఎంబిఎ కళాశాలలో గురువారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్‌ ఎం. నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పల్లె ఉమ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొట్నురులో ఉన్నా వృద్దాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ జి. శివ శంకర్‌ రెడ్డి, పరిపాలన అధికారి బి. గంగిరెడ్డి, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌. మంజునాథ్‌, డిగ్రీ వైస్‌ ప్రిన్సిపల్‌ ఉపేంద్ర, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొత్తచెరువు : కొత్తచెరువు లోనే టిడిపి కార్యాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సతీమణి పల్లె ఉమా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఎస్‌ శ్రీనివాసులు, మండల కన్వీనర్‌ రామకృష్ణచ టౌన్‌ కన్వీనర్‌ వలిపి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.