ప్రజాశక్తి - చింతలపూడి
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆశయాలు పాటిస్తూ కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలిచి యువతకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి పివి.సునీల్‌కుమార్ అని ఎయిమ్ రాష్ట్ర పిఎసి మెంబర్ ఎన్‌ఎస్.రాజేంద్ర అన్నారు. పట్టణంలో చిల్డ్రన్ లిబర్టీ హోమ్‌లో రాష్ట్ర డిజిపి పివి.సునీల్‌కుమార్ పుట్టినరోజు వేడుకలను చింతలపూడి ఎయిమ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి ఎయిమ్ (అంబేద్కర్స్ ఇండియా మిషన్) ముఖ్య నాయకులు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం చింతలపూడిలోని లిబర్టీ చిల్డ్రన్ హోమ్‌లో పిల్లలతో కేకే కట్ చేయించారు. పివి.సునీల్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్.రాజేంద్ర మాట్లాడుతూ ఎయిమ్ సంస్థ ద్వారా దళితవాడలను ప్రత్యేక దళిత పంచాయతీలు చేయాలని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎయిమ్ జిల్లా నాయకులు కాకర్ల సత్యం మాట్లాడుతూ యువత పివి.సునీల్‌కుమార్‌ని ఆదర్శంగా తిసుకుని జాతి ఎదుగులకు పాటుపడాలన్నారు. ప్రత్యేక దళిత పంచాయతీలు వస్తే దళితవాడలు అభివృధ్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఆజాద్, ఎయిమ్ యువత అవినాష్, హోమ్ నిర్వాహకుడు ఇజ్కియా గోందిరాజు, అవినాష్ అనిష్, ముత్యాలరావు, ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.










