అమ్మవారిని దర్శించుకుంటున్న నాయకులు
ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలోని కుందనగుర్తి గ్రామంలో అడపా బ్రదర్స్, ములగీరి బ్రదర్స్ ఆధ్వర్యంలో పెద్దమ్మ అవ్వ దేవర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ దేవర మహోత్సవానికి ముఖ్య అతిథులుగా కర్నూలు ఉమ్మడి జిల్లాల పంచాయతీరాజ్ జోనల్ వింగ్ అధ్యక్షులు, జడ్‌పిటిసి విరుపాక్షి, వైసిపి నాయకులు కప్పట్రాళ్ల బొజ్జమ్మ, రామచంద్ర నాయుడు, వైసిపి గుంతకల్ నియోజకవర్గ నాయకులు చిన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పెద్దమ్మ అవ్వను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఎంపిపి జూటూరు హేమలత మారయ్య, వైసిపి నాయకులు ఓబులేసు, జిల్లా వాల్మీకి అధ్యక్షులు రామాంజనేయులు, లోక్‌నాథ్, మాజీ ఎంపిటిసి మల్లికార్జున, లింగన్న, మురళీ, వలీ, జ్ఞానచంద్ర, రాము, రాజు, రామచంద్ర పాల్గొన్నారు.










