ప్రజాశక్తి - పర్చూరు
పౌష్టికాహార మహోత్సవాల్లో భాగంగా స్టాల్స్ నిర్వహించారు. చిరుధాన్యాల ప్రాముఖ్యత, పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను గురించి వివరించారు. గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికలు రక్తహీనతకు గురికాకుండా తీసుకోవలసిన ఆహార పదార్థాలను వివరించారు. తల్లిపాల ప్రాముఖ్యత చెప్పారు. సుసోషిత భారత్, సాక్షర భారత్, స్వశక్తి భారత్ దిశగా అడుగులు వేయాలని సిడిపిఓ సుభద్ర కోరారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు ఎం అన్నపూర్ణ, పి దీపాదేవి, ఎం రాధా, యద్దనపూడి సూపర్వైజర్ సిహెచ్ సుజాత, మార్టూరు సూపర్వైజర్లు కె పద్మావతి, డి శిరీష పాల్గొన్నారు.










