Jan 25,2023 23:51

అనకాపల్లిలో ర్యాలీ ప్రారంభిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఓటర్ల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఆర్‌డిఒ జయరాం ఆధ్వర్యంలో పలు కళాశాలల విద్యార్థులు ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుండి అబీద్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యువత ఆలోచించి సరైన నాయకుడ్ని ఓటు ద్వారా ఎన్నుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారవుతారని తెలిపారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్‌ సిఐ నమ్మి గణేష్‌, టౌన్‌ ఎస్సై ధనుంజయనాయుడు, ఎలక్షన్‌ డీటీ సుధారాణి పాల్గొన్నారు.
స్థానిక ఎండిఓ కార్యాలయం వద్ద ఎంపిడిఓ జయమాధవి ఆధ్వర్యంలో ఓటరు దినోత్సవం నిర్వహించారు.
నక్కపల్లి:ఓటుహక్కును సద్వినియోగం చేసు కోవాలని తహశీల్దార్‌ డి.సుబ్రహ్మణ్యశాస్త్రి సూచించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తహసిల్దార్‌ ఓటరు గుర్తింపు కార్డులు అందజేశారు. సీనియర్‌ సిటిజన్లు సత్కరించారు. ప్రజాస్వామ్యం లో ఓటుహక్కు వినియోగం అంశంపై వ్యాసరచన ,వక్తత్వం పోటీలలో గెలుపొందిన విజేతలైన విద్యార్థులకు ప్రశంసాపత్రములు, బహుమతులు అందజేశారు. విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సీతారామరాజు, ఎంఈఓ డివిడి ప్రసాద్‌, హెచ్‌. ఎమ్‌ రాణీలలిత, ఎలక్షన్‌ డిటి తాతాచారి, ఆర్‌ఐ శ్రీపాద సత్య భాస్కర ప్రసాద్‌, ఉపాధ్యాయులు ఎన్‌.అప్పారావు, ఎన్‌.వి.ఎస్‌.ఆచార్యులు, సత్యవతి, కుందూరు రాజు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ శైలజ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పిఓ అప్పారావు పాల్గొన్నారు.
కోటవురట్ల: తహశీల్దార్‌ జానకమ్మ సీనియర్‌ సిటిజన్స్‌ని సన్మానం చేశారు. ఎంపీడీవో చంద్రశేఖర్‌ ఆధ్వర్యాన ఓటర్‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మాకవరపాలెం:ఓటు వజ్రాయుధమని ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రసాదరావు తెలిపారు. జూనియర్‌ కాలేజ్‌ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి బస్‌స్టాండ్‌, వద్ద మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ సుందర్రావు, డీటి శంకర్రావు, సర్వే డీటీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ఫొటోరైటప్‌: గొలుగొండ-2. అవగాహన కల్పిస్తున్న దృశ్యం
గొలుగొండ:రావణాపల్లి పాఠశాలలో ఓటర్ల దినోత్సవ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్‌ అధ్యక్షులు కిలపర్తి పెద్దిరాజు, ఏఏసి చైర్మన్‌ కొల్లు సత్యనారాయణ, పాఠశాల హెచ్‌ఎం పద్మజ గ్రామ అనుబంధ కమిటీ అధ్యక్షులు కొల్లు గంగునాయుడు పాల్గొన్నారు.
పాతమల్లంపేట గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారి సిహెచ్‌.రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్ధులతో మానవహారం నిర్వహించారు. సీనియర్‌ సిటిజన్‌కు సన్మానించారు.
ఏఎల్‌పురం సచివాలయం, జెడ్పీ హైస్కూల్‌ వద్ద సీనియర్‌ ఓటర్లను సన్మానించారు. సచివాయల కార్యదర్శి రాజేష్‌, వీఆర్వో శ్రీధర్‌, హెచ్‌ఎం భారతి తదితరులు పాల్గొన్నారు.
రావికమతం:మండల కేంద్రంలో ఎంపీడీవో వెంకన్నబాబు, తహశీల్దారు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించారు. తట్టబంద నాలుగు రోడ్లు జంక్షన్లో మానవహారం ఏర్పడ్డారు. ఈవోపిఆర్‌డి రమణయ్య పాల్గొన్నారు.
కొత్తకోట:తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మహేశ్వరరావు ఆధ్వర్యంలో సీనియర్‌ ఓటర్‌ను ఘనంగా సన్మానించారు. మండలం కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్‌ఐ చినబ్బాయి, సిబ్బంది పాల్గొన్నారు.
ఫోటో.... అవగాహన ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌.... ఆన్లైన్‌